calender_icon.png 19 March, 2025 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూమిపైకి సునీతా విలియమ్స్

19-03-2025 01:16:53 AM

  1. క్రూ మిషన్ అన్‌డాకింగ్..
  2. వ్యోమగాముల రాక కోసం ఆసక్తిగా ప్రపంచం ఎదురుచూపు
  3. సునీతకు లేఖ రాసిన ప్రధాని మోదీ
  4. ఘనత వహించిన భారత పుత్రికవు నీవు అని సంబోధన

వాషింగ్టన్, మార్చి 18: 9 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్ (59), బుచ్ విల్మోర్ (62) ఎట్టకేలకు భూమ్మీదకు బయల్దేరారు. ఈ వ్యోమగాములను అంతరిక్షం నుంచి భూమ్మీదకు తీసుకొచ్చేందుకు వెళ్లిన స్పేస్ ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్ వీరిని తీసుకుని బయల్దేరింది. ఈ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయినట్లు నాసా ప్రకటించింది.

ఈ నౌక వస్తున్న తీరు ను నాసాకు చెందిన శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలిస్తున్నారు. బోయింగ్‌కు చెందిన టెస్ట్ ఫ్లుటై స్టార్ లైనర్‌లో సునీతా విలియమ్స్, విల్మోర్ గతేడాది జూన్ 5న వెళ్లారు. క్రూ మిషన్ అన్‌డాకిం గ్ ప్రక్రియను నాసా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. 

ఉదయం 3.27కు.. 

భూమ్మీదకు బయల్దేరిన వ్యోమగాములు భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు జామున 3.27కు పుడమికి చేరుకోనున్నా రు. ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో ఈ వ్యోమనౌక దిగనుంది. 

మోదీ ప్రత్యేక లేఖ

భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు భారత ప్రధాని మోదీ లేఖ రాశారు. ‘మీరు వేల మైళ్ల దూరంలో ఉన్నా కానీ మా మనసులకు దగ్గరగానే ఉన్నారు. నేను అమెరికా పర్యటనకు వెళ్లినపుడు మీ గురించి అడిగి తెలుసుకున్నా. మీ అంతరిక్ష యాత్ర విజయవంతం కావాలని మేమంతా ఆకాంక్షిస్తున్నాం.

మిమ్మల్ని భారత గడ్డపై చూసేందుకు ఎదురుచూస్తున్నాం.’ మార్చి ఒకటినే రాసి న ఈ లేఖను కేంద్ర మంత్రి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ లేఖపై సునీతా విలియమ్స్ సంతోషం వ్యక్తం చేస్తూ.. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. తనకు మద్దతు తెలిపినందు కు దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. 

సవాల్లెన్నో.. 

ఐఎస్‌ఎస్‌లో ఉండగా..  కండరాల బలహీనత, దృష్టిలోపం, రేడియేషన్ మాత్రమే కాకుం డా అనేక సవాళ్లు ఎదురవుతాయి. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ తొమ్మిది నెలల అనంత రం భూమి మీదకు వస్తుండటంతో వారికి అనేక ఆరోగ్య సమస్యలు ఎదురుకానున్నాయి. సునీత విలియమ్స్, విల్మోర్ దిగిన వెంటనే జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించి వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించనున్నారు.

అక్కడే వ్యోమగాముల క్వార్ట ర్స్ కూడా ఉన్నాయి. కానీ వారిని మాత్రం ఆరోగ్య తనిఖీల తర్వాతే వారి కుటుంబాల వద్దకు పం పుతారు. సునీతా విలియమ్స్ పూ ర్వీకుల గ్రామమైన గుజరాత్‌లోని ఝాలాసన్‌లో గ్రామస్తు లు యజ్ఞం నిర్వహించారు. ఆమె క్షేమంగా భూమికి చేరుకోవాలని పూజలు చేశారు. 

వ్యాయామాలు ప్రధానం

అంతరిక్ష కేంద్రంలో ఉన్నవారు ప్రతి రోజు రెండు గంటల పాటు వ్యాయామం చేయాలి. అక్కడ ఉండే జీరో గ్రావిటీ వల్ల వారి ఎముకలు బలహీనపడే అవకాశం ఉంటుంది. అందుకోసమే వ్యాయామాలు చేయడం తప్పనిసరి. బ్యాలెన్స్ అంతరాయం అనేది మరో సమస్య అని సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్సిటీలోని ఎయిరోస్పేస్ మెడిసిన్‌కు చెందిన ఎమ్మాన్యుయేల్ తెలిపారు.  మరో పెద్ద సమస్య.. ఫ్లూయడ్ షిఫ్టింగ్. ఇది మన మూత్రంలో కాల్షియం స్థాయిలు పెరిగేందుకు, కిడ్నీలలో రాళ్లు వచ్చే ప్రమాదాన్ని ఏర్పరుస్తుంది. 

రేడియేషన్ నిర్వహణ..

భూమి మీదతో పోల్చుకుంటే అంతరిక్ష కేం ద్రంలో రేడియేషన్ స్థాయిలు అధికంగా ఉంటా యి. అంతరిక్ష కేంద్రంలో ఉండే వ్యోమగాములకు ‘షీల్డ్’ అనేది తప్పని సరి. ఖగోళ భౌతిక శాస్త్రవేత్త సెయిగ్‌ఫ్రెడ్ మాట్లాడుతూ.. ‘వ్యోమ గాములు ధరించే కవచం సీసం లేదా నీటితో ధృడం గా తయారు చేయబడుతుంది. అంతరిక్ష కేంద్రంలో మెటాలిక్ స్పేస్ స్మెల్ అనే ఒకే రకమైన వాసన ఉంటుంది.’ అని ఆయన వివరించారు.