16-03-2025 03:30:33 PM
కెప్ కెనావెరాల్,(విజయక్రాంతి): భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, వ్యోమగామి బుచ్ విల్మోర్ వారంరోజుల యాత్ర కోసం రోదసిలోకి వెళ్లి వారు తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోనే చిక్కుకున్నారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. నలుగురు వ్యోమగాములతో ఐఎస్ఎస్ వెళ్లిన నాసా, స్పేస్ ఎక్స్ క్రూ-10 వ్యోమనౌక శనివారం తెల్లవారు జామున 4.33 గంటలకు అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్ర నుంచి రోదసిలోకి విజయవంతంగఅనుసంధానమైంది.
సునీత, విల్మోర్ స్థానంలో విధుల నిర్వహణకు వెళ్లిన నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్ లో కలిశారు. ఐఎస్ఎస్ లో చిక్కుకున్న వారితో వచ్చే వారం స్పేస్ ఎక్స్ క్యాప్యూల్ లో వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సునీత, విల్మోర్ ను తీసుకొచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్ క్రూ-10 మిషన్ ప్రయోగించారు. క్రూ-10 మిషన్ లో భాగంగా స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ దీన్ని నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగంలో అమెరికాకు చెందిన ఆన్ మెక్ క్లెయిన్, నికోల్ అయర్స్, జపాన్ వ్యోమగామి టకుయా ఒనిషి, రష్యాకు చెందిన కిరల్ పెస్కోవ్ లు ఐఎస్ఎస్ కు పయనమయ్యారు.