మార్చి చివరి వారంలో తీసుకొస్తున్నట్టు ప్రకటించిన నాసా
వాషింగ్టన్, డిసెంబర్ 19: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్) నుంచి వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ వి ల్‌మోర్‌లను తీసుకురావడానికి మరింత సమయం పడుతుందని నాసా ఓ ప్రకటనలో తెలిపింది. వారిద్దరూ ఐఎస్‌ఎస్ నుంచి వచ్చే ఏడాది మార్చి చివరివారంలో భూమి కి చేరే అవకాశం ఉందని వెల్లడించింది.
సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్‌లను తీ సుకురావాలంటే అంతకంటే ముందు మరికొందరు వ్యోమగాములను స్పేస్‌ఎక్స్ క్య్రూ -10 మిషన్ ద్వారా ఐఎస్‌ఎస్‌కు పంపాల్సి ఉంటుందని చెప్పింది. ఈ మిషన్‌ను ఫిబ్రవరిలోనే చేపట్టాల్సి ఉన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల మార్చికు రీషెడ్యూల్ చేసినట్టు వివరించింది.
కాగా, సునీతా విలియమ్స్, బుచ్‌మోర్ ఈ ఏడాది జూన్ 5న ఐఎస్‌ఎస్‌కు బయల్దేరి వెళ్లారు. వారం రోజుల తర్వాత వీరిద్దరూ తిరిగి రావాల్సి ఉన్నా వ్యోమనౌకలో ఏర్పడ్డ సాంకేతిక సమస్యతో వాళ్లు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.