calender_icon.png 21 January, 2025 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సునీల్‌రావు x రాజేందర్‌రావు

07-07-2024 02:45:56 AM

  • కరీంనగర్ స్మార్ట్ సిటీలో రాజకీయ వేడి 
  • ఒకరిపై ఒకరు ఆరోపణలు

కరీంనగర్, జూలై 6 (విజయక్రాంతి): కరీంనగర్ స్మార్ట్ సిటీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వెలిచాల రాజేందర్‌రావు, నగర మేయర్ వై సునీల్‌రావు పరస్పర ఆరోపణలకు దిగారు. శనివారం కరీంనగర్ ప్రెస్‌క్లబ్‌లో కాంగ్రెస్ కార్పొరేటర్లు, నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజేందర్‌రావు మాట్లాడుతూ.. అవినీతి అనకొండ సునీల్‌రావు అంటూ ధ్వజమెత్తారు. కరీంనగర్ చరిత్రలో ఇంత అవినీతి ఎప్పుడు జరగలే దన్నారు. నాలుగు రోజులుగా తాను వం దలాది మందిని కలిశానని, ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా అవినీతి మాటే వినిపించిందని ఆరోపించారు. అందుకే ఈ విషయా లను ప్రజలకు తెలియజేసి, దీనిపై పోరాటం చేస్తామని ప్రకటించారు.

స్మార్ట్ సిటీలో జరిగిన అవినీతి అక్రమాలపై స్వంత పార్టీకి చెం దిన కార్పొరేటర్ రవీందర్‌సింగ్, మాజీ ఎమ్మె ల్యే గోనె ప్రకాశ్‌రావు సునీల్‌రావుపై ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. ప్రభుత్వానికి, సీఎంకు, మంత్రికి ఈ విషయాలను తెలియజేసి రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ద్వారా విచారణ జరిపించాలని కోరతామని వెల్లడించారు. కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేసి అందులో వచ్చిన ఫిర్యా దులను సేకరించి దర్యాప్తు సంస్థలకు అందజేస్తామని తెలిపారు. కరీంనగర్ నగరా భివృద్ధికి డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరిం చేందుకు కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు.  

తాతలు, తండ్రుల పేరు చెప్పుకొనే చరిత్ర నీది : మేయర్ సునీల్‌రావు ధ్వజం

డబ్బులు పెట్టి టికెట్ తెచ్చుకున్న కొంతమంది నాయకులు సైతం అవినీతి, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు ఎద్దేవాచేశారు. శనివారం కరీంనగర్‌లో మీడి యా సమావేశంలో మాట్లాడుతూ ఆయన వెలిచాల రాజేందర్‌రావుపై ధ్వజమెత్తారు. తాతలు, తండ్రుల చరిత్ర చెప్పుకొని రాజకీయాలు చేసే రాజేందర్‌రావు.. ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ఆరోపణలు చేసే ముందు మన చరిత్ర ఎలా ఉందో ఆలోచన చేసుకోవాలని హితవు పలికారు.

మూడుసార్లు ఓడిపోయిన రాజేందర్‌రావు ఎన్నికల గురించి మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో క్యాడర్ లేక రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఇచ్చి కార్పొరేటర్లను కొనుక్కున్న చరిత్ర రాజేందర్‌ది అని మండిపడ్డారు. తన తండ్రి ఎమ్మెల్యేగా పనిచేసిన ప్పుడు అన్ని కాంట్రాక్టులు ఆయనవేనని దుయ్యబట్టారు. న్యాయపరంగా ఆనాడు కార్యకర్తకు రావాల్సిన మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని లాక్కున్న నీచ చరిత్ర నీదని విరుచుకుపడ్డారు. ఏ పార్టీ అధికారంలో ఉం టే ఆ పార్టీ రాజేందర్‌రావుదని, అలాంటి వ్య క్తి ఉపన్యాసాలిస్తే ప్రజలు నమ్మరని చెప్పారు. ఎన్నికలలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేలా చూడాలని హితవు పలికారు.