calender_icon.png 25 November, 2024 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సునీల్ చూపు కమలం వైపు?

08-10-2024 12:00:00 AM

బండితో తరచూ ములాఖత్!

కరీంనగర్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు కమలం వైపు చూస్తున్నారు. బీఆర్‌ఎస్ ను వీడేది లేదంటూ తన అనుచరుల వద్ద చెప్పుకొస్తున్నా రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. కొన్ని రోజులుగా తరచూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌తో ములాఖత్ అవుతుండటం చర్చ నీయాంశంగా మారింది.

సునీల్‌రావు ఆరు పర్యాయాలు కౌన్సిలర్‌గా, కార్పొరేటర్‌గా గెలుస్తూ వస్తున్నారు. 2020లో కరీంనగర్ మేయర్‌గా బీఆర్‌ఎస్ నుంచి ఎన్నికయ్యారు. తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉన్న సునీల్‌రావు 2014లో కార్పొరేటర్‌గా గెలిచిన అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2020లో కార్పొరేటర్‌గా ఎన్నికై మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ల అండతో మేయర్ అయ్యా రు.

బండి సంజయ్‌కుమార్‌కు సునీల్‌కు మ ధ్య పెద్దగా అనుబంధం లేకున్నా ఈ మధ్యకాలంలో తరచూ స్మార్ట్ సిటీ విషయంలో సంజయ్ సహకరించిన తీరును కొనియాడు తూ వస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎన్నికైన అనంతరం విపార్క్‌లో కార్పొరేటర్లతో కలిసి సంజయ్‌ను సన్మానించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధికారం కో ల్పోయిన అనంతరం సునీల్‌రావు వైఖరిలో మార్పు చోటు చేసుకుంది.

2024 పార్లమెం ట్ ఎన్నికల వరకు మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ను పొగుడుతూ సంజయ్‌పై విమర్శ నాస్త్రాలు సంధించిన సునీల్ ఈ మధ్యకాలంలో సంజయ్‌కు అనుకూలంగా వ్యవహరి స్తుండటం చర్చనీయాంశంగా మారింది. మ హాశక్తి ఆలయంలో జరుగుతున్న దేవి నవరాత్రోత్సవాల్లో ఆదివారం అర్ధరాత్రి వరకు సంజయ్‌తో కలిసి ఉత్సవాలను, దాండియా వేడుకలను తిలకించారు.

ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య రాజకీయ అంశాలు, తాజా పరిస్థితులపై చర్చ జరిగినట్లు తెలిసింది. సునీల్‌రావు ఈ మధ్య అమెరికాలో పర్యటించిన ప్పుడు బీఆర్‌ఎస్‌కు చెందిన నగర అధ్యక్షు డు చల్ల హరిశంకర్ ఆయన సతీమణి, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి తమ కు ఇన్‌చార్జి ఇవ్వలేదంటూ పత్రికలకెక్కారు.

సొంత పార్టీకి చెందినవారే పత్రికలకెక్కడం, మాజీ మేయర్ రవీందర్‌సింగ్ తదితరులు నగరపాలక సంస్థపై పరోక్షంగా సునీల్‌పై విమర్శలు సంధిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సునీల్ బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించినట్లు ఆయన అనుచరవర్గాలు అంటున్నాయి. పదవీకాలం జనవరిలో ముగిసిన అనంతరం బీజేపీలో చేరతాడన్న ప్రచారం జరుగుతున్నది.