10-04-2025 03:11:14 PM
మద్నూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలం మొఘా గ్రామంలో జుక్కల్ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఆదేశాల మేరకు గురువారం పొద్దు తిరుగుడు పువ్వు గింజల కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసి వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రభుత్వ మద్దతు ధర క్వింటల్ కు రూ. 7,280 చెల్లిస్తుందని తెలిపారు, రైతులందరు పొద్దు తిరుగుడు గింజలను మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో వ్యవసాయ అధికారి శివ ఏఈఓ విశాల్ సోసైటీ చైర్మన్ రామ్ పటేల్ మాజీ ఎంపిటిసి హన్మంత్ పటేల్ మాజీ ఉప సర్పంచ్ నాగనాథ్ సంగ్రామ్ పటేల్, మల్లు గోండా, సుధాకర్ గౌడ్,రైతులు తదితరులు పాల్గొన్నారు.