పొద్దు తిరుగుడు కొనుగోళ్లు నేటి నుంచి పునఃప్రారంభం
25-05-2026 01:47 AM
బెజ్జంకి, మే 24: పొద్దు తిరుగుడు కొ నుగోలు ప్రక్రియలో కొంత ఆలస్యం జరిగిన నేపథ్యంలో నేటి నుంచి తిరిగి కొనుగోళ్లు ప్రారంభం కానున్నట్లు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
మం డలంలోని రైతులందరూ బెజ్జంకి మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రానికి తమ పంటను తీసుకువచ్చి, ప్రభుత్వ కొనుగోలు సదుపాయా న్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.






