04-03-2025 01:14:20 AM
విచారణ చేపట్టిన హైకోర్టు
హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ అందిన లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించి సోమవారం విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గనులు, భూగర్భశాఖ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్లకు నోటీసులు జారీ చేసింది.
అక్ర మ మైనింగ్ జరగకుండా చూడాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ఎన్ శ్రీరాములు హైకోర్టుకు లేఖ రాశారు. అనుమతిపొందిన ప్రాంతాల్లోనే కాకుండా అను మతి లేని ప్రాంతాల్లోనూ మైనింగ్ చేపడుతున్నారన్నారు. ఈ పిల్‌ను యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ రేణుకా యారా ధర్మాసనం సోమవారం విచారించింది.