calender_icon.png 27 December, 2024 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెనడా రాయబారికి సమన్లు

03-11-2024 02:41:55 AM

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై ఆరోపణలు చేసినందుకు చర్యలు

న్యూఢిల్లీ, నవంబర్ 2: భారత్‌పై ఆరోపణలతో ఇప్పటికే దౌత్య సంబంధాలను దెబ్బతీసుకున్న కెనడా.. తన వైఖరి మార్చుకోకుండా మరోసారి బరితెగించింది. ఆ దేశానికి చెందిన మంత్రి ఒకరు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఆరోపణలు గుప్పించారు. కాగా ఈ చర్యను తీవ్రంగా ఖండించిన భారత్.. కెనడా హైకమిషన్ ప్రతినిధిని పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. కెనడాలో ఖలిస్థానీ సానుభూతిపరులపై దాడులు జరగడం వెనక భారత హస్తం ఉందని కెనడాపై డిప్యూటీ మంత్రి డేవిడ్ మోరిసన్ ఆరోపణలు చేశారు.

భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ.. ఈ వ్యవహారంలో కెనడా అధికారికి సమన్లు జారీ చేశామని చెప్పారు. ఇటీవల అట్టావాలో పబ్లిక్ సేఫ్టీ అండ్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన స్టాం డింగ్ కమిటీ సమావేశంలో కెనడా డి ప్యూటీ మంత్రి డేవిడ్ మోరిసన్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై నిరాధార ఆరో పణలు చేశారని వెల్లడించారు. బాధ్యతారాహిత్యమైన ఇలాంటి వ్యాఖ్యల వల్ల దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. కాగా మోరిసన్ వ్యాఖ్యలపై అమెరికా సైతం స్పందించింది. ఆ ఆరోపణలు ఆందోళనకరమని, తాము కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిపింది.