28-04-2025 01:19:37 AM
ఎస్సీఎస్టీటీయూ జిల్లా శాఖ డిమాండ్
నిర్మల్ ఏప్రిల్ 2౭(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు అదే విధం గా పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించిన మాదిరిగానే అంగన్వాడి పిల్లలకు కూడా వేసవి సెలవులు ప్రకటించాలని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేష్ నాయక్ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వాతావరణ శాఖ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించిన దృశ్య 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు దాటుతున్నందున జిల్లాలో చాలా తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉన్నందున వెంటనే అంగన్వాడీలకు సెలవులు ప్రకటించాలని లేకుంటే ఆయా విద్యార్థుల ఇళ్లల్లోకి అంగన్వాడీ టీచర్లు వెళ్లి సరుకులు సరఫరా చేసేలా మార్పులు చేయాలని రాష్ట్రంలోని చాలా అంగన్వాడీ కేంద్రాలకు స్వంతా భవనాలు లేవని అద్దె భవనాలలో ఉన్న అంగన్వాడీలలో ఫ్యాను లేవని సరైన వసతులు లేక ఎండ ఉక్క పోత లో విద్యార్థులు,
టీచర్లు, ఆయలు, కూర్చవలసి వస్తుందని విద్యార్థుల సౌకర్యం దృశ్య ఎండాకాలం సెలవులు వెంటనే ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడమైనది కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.