calender_icon.png 30 April, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మే 4 వరకు వర్షాలే

29-04-2025 11:51:43 PM

రాబోయే 5 రోజులు తగ్గనున్న వేసవి తాపం...

హైదరాబాద్ (విజయక్రాంతి): మే 4వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 5 రోజుల పాటు ఎక్కడా ఉష్ణోగ్రత పెరుగుదలలు ఉండబోవని తెలిపింది. బుధవారం ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండతో పాటు సిద్దిపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కి.మీ.ల వేగంతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యింది. మిగతా రోజుల్లో మాత్రం మోస్తరు వర్షాలు కొనసాగనున్నాయి.