calender_icon.png 26 April, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి పిల్లలకి సమ్మర్ కోచింగ్ క్యాంప్...

25-04-2025 06:09:01 PM

కొత్తగూడెం (విజయక్రాంతి): సింగరేణి వ్యాప్తముగా 11 ఏరియాలలో ప్రతీ ఏడాది నిర్వహించే, సమ్మర్ క్యాంప్ లలో భాగముగా, ఈ ఏడాది కూడా సింగరేణి కార్పొరేట్ ఏరియా ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరంకు గాను, 18  సంవత్సరాల లోపు సింగరేణి ఉద్యోగుల పిల్లలకు (బాల, బాలికలకు), కొత్తగూడెం పరిసర ప్రాంతాల పిల్లలకు ఈ నెల 26 వ తారీఖు నుండి మే 20 వరకు అనుబవజ్ఞులైన శిక్షకులచే, సమ్మర్ కోచింగ్ నిర్వహించబడునని జిఎం (పర్సనల్) వెల్ఫేర్ కవిత నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన పిల్లలు  (బాలురు, బాలికలు) శనివారం సాయంత్రం 4.30 గంటలకు ప్రకాశం స్టేడియం నందు ప్రారంభం అయ్యే, సమ్మర్ కోచింగ్ క్యాంప్ కి హాజరై తమ పేర్లను నమోదు చేసుకొవాలన్నారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరారు.

క్రీడల వివరాలు:

అథ్లెటిక్స్

స్థలం: ప్రకాశం స్టేడియం, కొత్తగూడెం

సమయం: ఉదయం 6.00గం-8.00గం

సాయంత్రం: 5.30 గం-7.00గం

బాస్కెట్ బాల్

వేదిక: సి‌ఈ‌ఆర్ క్లబ్, కొత్తగూడెం

సమయం: ఉదయం 6.00గం-8.00గం

సాయంత్రం: 5.30 గం-7.00గం

బాక్సింగ్

వేదిక: ప్రకాశం స్టేడియం, కొత్తగూడెం

సమయం: ఉదయం 6.00గం-8.00గం

సాయంత్రం: 5.30 గం-7.00గం

ఫుట్ బాల్

వేదిక: ప్రకాశం స్టేడియం, కొత్తగూడెం

సమయం: ఉదయం 6.00గం-8.00గం

సాయంత్రం: 5.30 గం-7.00గం

వాలీబాల్

వేదిక: ప్రకాశం స్టేడియం, కొత్తగూడెం

సమయం: ఉదయం 6.00గం-8.00గం

సాయంత్రం: 5.30 గం-7.00గం

కుంగ్ ఫు/కరాటే

వేదిక: ప్రకాశం స్టేడియం, కొత్తగూడెం

సమయం: ఉదయం 6.00గం-8.00గం

సాయంత్రం: 5.30 గం-7.00గం

డ్రాయింగ్

వేదిక: ప్రకాశం స్టేడియం, కొత్తగూడెం

సమయం: ఉదయం 7.00 గం - 8.30గం (ఉదయం మాత్రమే)

పైన తెలిపిన ఆటలలో ఆసక్తి గల ఉద్యోగుల పిల్లలు ఆయా వేదికలలో పైన తెలిపిన తేదీలు, సమయాలలో పాల్గొని, క్రీడలలో నైపుణ్యం సంపాధించి ఈ వేసవి సెలవులను సద్వినియోగ పరచుకోవాలని కోరారు.