17-12-2024 01:05:08 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 16 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ పరిధి లో విద్యుత్ డిమాండ్ వినియోగం గతేడాది వేసవితో పోలిస్తే ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. గతేడాది 3756 మెగావాట్లుగా ఉనన గరిష్ఠ డిమాండ్ ఈ ఏడాది దాదాపు 16 శాతం వృద్ధితో 4,352 మెగావాట్లుగా నమోదైంది. విద్యుత్ డిమాండ్ ఎంతగా పెరిగినా ఎలాంటి ఆటంకాలు లేకుండా సరఫ రా చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఎస్‌పీడీసీఎల్ అధికార యంత్రాంగం తగు ఏర్పాట్లలో నిమగ్నమైంది.
ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం ఉన్న సబ్ స్టేషన్లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను, డీటీఆర్‌లను ఎస్‌పీడీసీఎల్ అదనంగా ఏర్పాటు చేస్తోంది. ఈ సందర్భంగా సీఎండీ ముషారఫ్ ఫారూఖీ మేడ్చల్ సర్కిల్ బౌరంపేటలోని 132 కేవీ సబ్ స్టేషన్ టవర్ నిర్మాణ పనులు తనిఖీలు చేయడంతో పాటు 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌లను సోమవారం ప్రారంభించారు. సిటీలోని వివి ధ సర్కిళ్లలోనూ వివిధ కార్యక్రమాలు కొనసాగాయి. తనిఖీల్లో మేడ్చల్ సీఈ అట్లూరి కామేశ్, ఎస్‌ఈ రవికుమార్ పాల్గొన్నారు.