న్యూఢిల్లీ: భారత టెన్నిస్ సింగిల్స్ నెంబర్‌వన్ స్టార్ సుమిత్ నాగల్ కెరీర్లో అత్యుత్తమ ర్యాంకింగ్ సాధించాడు. సోమవారం విడుదల చేసిన ఏటీపీ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో నాగల్ 71వ ర్యాంక్‌లో నిలిచాడు. గత వారం 77వ ర్యాంకులో నిలిచిన సుమిత్ ఈ వారం పెరుగియా ఏటీపీ చాలెంజర్స్ టోర్నీలో రన్నరప్‌గా నిలవడం ద్వారా ఆరు స్థానాలు మెరుగుపరుచుకొని అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు. ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో భారత తరపున సింగిల్స్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకున్న నాగల్ ఈ ఏడాది అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు.
2023 నుంచి నాలుగు ఏటీపీ చాలెంజర్స్ టోర్నీలు నెగ్గిన సుమిత్ నాగల్ ఈ నెల ఆరంభంలో జర్మనీ వేదికగా జరిగిన హైల్ బ్రోన్ చాలెంజర్ టోర్నీలో విజేతగా అవతరించాడు. తాజాగా ముగిసిన పెరుగియా ఏటీపీ చాలెంజర్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం అర్థరాత్రి జరిగిన ఫైనల్లో సుమిత్ నాగల్ 1 1 లూసియానో డార్దెరీ (ఇటలీ) చేతిలో పరాజయం చవిచూశాడు. ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్‌కు చేరుకొని నాగల్ సంచలనం సృష్టించాడు.