calender_icon.png 22 April, 2025 | 10:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీకారం చుట్టుకున్న సుమతీ శతకం

22-04-2025 12:00:00 AM

సన్నీ లియోన్ నటించిన ‘మందిర’తో విజయాన్ని అందుకున్న విజన్ మూవీ మేకర్స్ ‘సుమతీ శతకం’ అంటూ కొత్త ప్రాజెక్టును ప్రారంభించారు. సాయిసుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాతో ఎంఎం నాయుడు దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ సినిమాలో బిగ్‌బాస్ ఫేమ్ అమర్‌దీప్ చౌదరి, సైలీ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ యూత్‌ఫుల్, ఎంగేజింగ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ప్రాజెక్టు సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. అమరావతిలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి బండారు నాయుడు కథను అందించగా సుభాష్ ఆనంద్ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ సినిమాకు డీవోపీ: హాల్‌స్వామి ఎస్; ఎడిటర్: సురేశ్ విన్నకోట.