21-02-2025 12:00:00 AM
టాలీవుడ్, బాలీవుడ్‌లలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రష్మిక మందన్నా. ఈ ముద్దుగుమ్మను ఈ రెండు ఇండస్ట్రీల నుంచి వరుస అవకాశాలు వరిస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్‌లో మహేశ్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్స్‌తో రష్మిక నటించింది. కానీ ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్స్‌తో మాత్రం నటించే అవకాశం రాలేదు. ఇంకా ఆమెకు అదొక లోటుగానే ఉంది. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానతో సినిమా చేస్తున్నాడు.
ఇది అవగానే సుకుమార్‌తో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుందా? లేదా? అనే చర్చ నెట్టింట జోరుగా సాగుతోంది. ఈ సినిమాలో కూడా రష్మికను సుకుమార్ తీసుకుంటే వీరిద్దరి హ్యాట్రిక్ మూవీ అవుతుంది. పైగా ఇప్పటి వరకూ రామ్ చరణ్‌తో నటించలేదు కాబట్టి కొత్తగా.. ఫ్రెష్ పెయిర్‌గా ఉంటుందని ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. మరి సుకుమార్ ఏం చేస్తారో చూడాలి. రష్మిక అయితే తాజాగా ‘చావా’తో బాలీవుడ్‌లో మంచి హిట్ కొట్టింది. ఆమె నటించిన మరో చిత్రం ‘సికిందర్’ విడుదలకు సిద్ధమవుతోంది.