calender_icon.png 24 January, 2025 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దర్శకుల సంఘానికి సుకుమార్ విరాళం

14-08-2024 12:05:00 AM

తెలుగు సినిమా దర్శకుడు సుకుమార్ తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘానికి విరాళం అందజేశారు. సంఘం సభ్యులకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని మరింత పకడ్బందీగా కొనసాగించేందుకు రూ.5 లక్షలు విరాళంగా అందించారని ఆ సంఘ అధ్యక్షుడు బి.వీరశంకర్, కార్యదర్శి సీహెచ్.సుబ్బారెడ్డి తెలియజేశారు. తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘానికి ఎప్పుడు అవసరమైనా తాను అందుబాటులో ఉంటానని సుకుమార్ చెప్పడం తమకెంతో ఆనందాన్ని కలిగించిందని అధ్యక్ష కార్యదర్శులు హర్షం వ్యక్తం చేశారు.