పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా
పంజాబ్, నవంబర్ 16: శిరోమణి అకాలీదళ్ అధ్యక్ష పదవికి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ (62) శనివారం రాజీనామా చేశారని పంజాబ్ మాజీ విద్యాశాఖ మంత్రి దల్జీత్ ఎస్ చీమా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. నూతన అధ్యక్షుడిని ఎన్నుకోనున్న నేపథ్యంలో సుఖ్‌బీర్ సింగ్ పార్టీ వర్కింగ్ కమిటీకి సుఖ్‌బీర్ ఈ రోజు తన రాజీనామాను సమర్పించినట్లు చీమా తెలిపా రు. ఇటీవల సిక్కు మతపెద్దలు సుఖ్‌బీర్‌ను టంకయ్యగా డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. సిక్కు మత సూత్రాలను ఉల్లంఘించేవారిని టంకయ్యగా పేర్కొంటారు. ఈ కేసులో దోషిగా తేలితే ఆయనకు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. అయితే తన పదవీ కాలంలో తనకు సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ సుఖ్‌బీర్ కృతజ్ఞతలు తెలిపారు. తదుపరి కార్యచరణ కోసం సోమవారం చండీగఢ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం లో శిరోమణి అకాలీదళ్ ముఖ్య నేతలు సమావేశం కానున్నారు.