కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): తెలంగాణలో 90 శాతం చెరువులను కబ్జా చేసింది బీఆర్‌ఎస్ నాయకులేనని, ఈ విషయాన్ని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. చెరువుల కబ్జాల పాపం కేసీఆర్, హరీశ్‌రావుదేనని ఆరోపించారు. బుధవారం గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. మామ అల్లుళ్లకు ‘సుఖర ముఖం’ శిక్ష పడ టం ఖాయమని వ్యాఖ్యానించారు. కేటీఆర్ కేవలం ట్విట్టర్‌లో లొల్లి పెట్టడానికే పనికొస్తారని, తొందరపడి మాట్లాడటం, తర్వాత క్షమాపణలు చెప్పడంలో గిన్నిస్‌బుక్ రికార్డ్‌ల్లో ఎక్కారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో నాలాల అక్రమణలను తొలగించడానికి సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రా తెచ్చారని తెలిపారు. వరంగల్‌లో బీభత్సం జరగడానికి చెరువుల అక్రమణనే కారణమన్నారు.