calender_icon.png 20 January, 2025 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెమీస్‌లో సుకంత్.. క్వార్టర్స్‌లో కౌర్

01-09-2024 12:07:30 AM

  1. బ్యాడ్మింటన్‌లో షట్లర్ల జోరు 
  2. రోయింగ్ రెపిచేజ్‌లో మూడో స్థానం

పారిస్: పారాలింపిక్స్‌లో భారత షట్లర్ల జోరు కొనసాగుతుంది. పురుషుల విభాగంలో నితేశ్ కుమార్, సుకంత్ కదమ్‌లు సెమీస్‌కు దూసుకెళ్లగా.. మహిళల విభాగంలో మణిదీప్ కౌర్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఎస్‌ఎల్ కేటగిరీలో గ్రూప్ నితేశ్ 21 21 థాయ్‌లాండ్‌కు చెందిన బున్సున్‌ను ఓడించి హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్ టాపర్‌గా నిలిచాడు. తద్వారా నితేశ్ సెమీస్‌లో అడుగుపెట్టాడు. ఇదే కేటగిరీలో టోక్యో పారాలింపిక్స్ కాంస్య విజేత మనోజ్ సర్కార్ విజయంతో టోర్నీ నుంచి వైదొలిగాడు. తాను ఆడిన చివరి లీగ్ మ్యాచ్‌లో మనోజ్ 21 21 చైనా షట్లర్ యాంగ్‌ను ఓడించాడు. అయితే ఇదే గ్రూప్‌లో బున్సున్, నితేశ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడడంతో సెమీస్ చేరడంలో విఫలమయ్యాడు.

ఇక ఎస్‌ఎల్ విభాగంలో గ్రూప్ నుంచి సుకంత్ కదమ్ 21 21 థాయ్‌లాండ్‌కు చెందిన సిరిపొంగ్‌ను ఓడించి సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్నాడు. గ్రూప్ దశలో ఓటమి ఎరుగని సుకంత్ ఇప్పటికే సెమీస్ చేరిన సుహాస్ యతిరాజ్‌తో జాయిన్ అయ్యాడు. మహిళల సింగిల్స్ ఎస్‌ఎల్ కేటగిరీలో మన్‌దీప్ కౌర్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. శనివారం తన చివరి లీగ్ మ్యాచ్‌లో మన్‌దీప్ 21 21 21 వినోట్  సిలిన్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించింది. అయితే నైజీరియా ప్లేయర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో మన్‌దీప్ పరాజయం పాలవ్వడంతో క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఇక మిక్స్‌డ్ డబుల్స్‌లో గ్రూప్ నితేశ్ జోడీ, గ్రూప్ సుహాస్ యతిరాజ్‌ెేకోహ్లీ పాలక్ జోడీలు ఓటములు చవిచూడగా.. గ్రూప్ శివరాజన్‌నిత్య శ్రీ జోడీ మాత్రం విజయం సాధించింది. 

సైక్లింగ్‌లో నిరాశే..

ఇక పారా సైక్లింగ్ ట్రాక్ విభాగంలో భార త అథ్లెట్లు నిరాశపరిచారు. మహిళల సీ1 500 మీ టైమ్ ట్రయల్ క్వాలిఫికేషన్ రౌండ్ లో భారత పారా అథ్లెట్ జ్యోతి గడేరియా నిరాశపరిచింది. రేసును 52.098 సెకన్లలో పూర్తి చేసిన జ్యోతి 11వ స్థానంలో నిలిచింది. పురుషుల సీ1 1000 మీ టైమ్  ట్రయల్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో షేక్ అర్షద్ (నిమిషం 26.154 సెకన్లలో) రేసును పూర్తి చేసి ఆఖరి స్థానంలో నిలిచాడు. ఇక పారా రోయింగ్ మిక్స్‌డ్ స్కల్  రెపిచేజ్ ఈవెంట్‌లో అనిత నారాయణ జంట మూడో స్థా నంలో నిలిచింది. రేసును 7నిమిషాల 54. 33 సెకన్లలో పూర్తి చేసిన ఈ జోడీ ఫైనల్ ఈవెంట్‌కు క్వాలిఫై అయింది. ఇక ఫైనల్ అనిత జోడీ ఏడు నుంచి 12వ స్థానం కోసం పోటీ పడనుంది.