calender_icon.png 5 January, 2025 | 2:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా భూమిపై సుజనాచౌదరి రుణం

31-12-2024 02:53:09 AM

  1. సీసీఎస్‌కు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు
  2. హైకోర్టులో బాధితుడి పిటిషన్  
  3. పోలీసుల వివరణ కోరిన న్యాయమూర్తి
  4. విచారణ జనవరి 20కి వాయిదా 

హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): అమీర్‌పేటలోని తనకు చెందిన 26 వేలకుపైగా గజాల భూమిని బీజేపీ నాయకుడు, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి తనదిగా చెప్పుకొని రూ.91 కోట్ల రు ణం తీసుకుని చెల్లించకపోవడంతో ఇప్పుడు ఆ భూమి వేలానికి వచ్చిందంటూ హైకోర్టు లో పిటిషన్ దాఖలైంది.

ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గత ఫిబ్రవరి 1న ఫిర్యాదు చేసినా విచారణ చేయడం లేదని బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023లోని సెక్షన్ 193 ప్రకారం విచారణను త్వరితగతిన పూర్తి చేసే లా బషీరాబాగ్‌లోని ఆర్థిక నేరాల విభాగం సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించాలని పిటిషనర్ కోరారు.

ఈమేరకు హైదరాబాద్‌కు చెందిన హబీబ్ అల్లాదిన్ పిటిషన్ వేశారు. దీనిని సోమవారం జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పోలీసులు ఫిర్యాదుపై విచారణను ఎందుకు జాప్యం చేశారో చెప్పాలని ఆదేశించారు. తదుపరి విచారణను జన వరి 20కి వాయిదా వేశారు.

తన భూమిని అక్రమంగా తాకట్టుపెట్టి రుణాన్ని పొందిన వ్యవహారంపై వోలాస్ లిమిటెడ్ డైరెక్టర్లు, వర్మ రియల్టర్స్‌కు చెందిన వారితోపాటు సుజన యూనివర్సల్స్ ఇండస్ట్రీస్, డైరెక్టర్లు, దాని చైర్మన్ ఏ సుజనా చౌదరి తదితరులపై ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేయడం లేదం టూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాది స్తూ..

పిటిషనర్‌కు చెందిన 26,136 చదరపు గజాల స్థలాన్ని తాకట్టుపెట్టి ఎక్సోర్టు ఇం పోర్టు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వర్మ రియల్టర్స్ తరపున పీవీ రమణారెడ్డి రూ.91 కోట్లు రుణం తీసుకున్నారని ఆరోపించారు. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ తీసుకున్న రుణానికి వర్మ రియల్టర్స్ హామీగా ఉందని వివరించారు.

సుజనా యూనివర్సల్స్ రుణా న్ని చెల్లించకపోవడంతో వర్మ రియల్టర్స్ తాకట్టు పెట్టిన రూ.400 కోట్ల భూమిని వేలానికి పెట్టారని చెప్పారు. వోల్టాస్‌కు లీజు కు ఇచ్చిన భూమిని వర్మ రియల్టర్స్‌కు అప్పగించడం వంటి అంశాలపై కోర్టు కేసులు న్నాయని పేర్కొన్నారు.

అందరూ కుమ్మక్కు అయి తమ భూమిపై రుణం తీసుకోవడమే కాకుండా వేలానికి వచ్చేలా చేశారని చెప్పా రు. సుజనా చౌదరితోపాటు 17 మందిపై గత ఫిబ్రవరి 1న సీసీఎస్ పోలీసులకు ఫిర్యా దు చేస్తే చర్యలు లేవని ఆరోపించారు. పోలీసులు సత్వరం దర్యాప్తు పూర్తి చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

పిటిషన్‌లో కీలక అంశాలు

‘అమీర్‌పేట్ మండలం బహ్లూఖాన్‌గూడలోని సర్వే నంబర్ 129/3లోని 26,436.36 చదరపు గజాల నా భూమిని వర్మ రియల్ట ర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన పీవీ రమణారెడ్డి 2013లో ఎక్సోర్టు ఇంపోర్టు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చట్టవిరుద్ధంగా తాకట్టు పెట్టారు. బీజేపీ (అప్పట్లో టీడీపీ) నేత సుజనాచౌదరి చైర్మన్‌గా ఉన్న సుజనా యూని వర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తీసుకున్న రుణానికి వర్మ రియల్టర్స్ గ్యారెంటీ ఇచ్చింది.

సుజ నా ఇండస్ట్రీస్ రుణాలు చెల్లించకపోవడంతో ఆ మొత్తం రాబట్టే క్రమంలో రూ.400 కోట్ల విలువైన నా ఆస్తిని వేలానికి పెట్టారు. వెంట నే వేలాన్ని అడ్డుకోవాలి. తప్పుడు విధానాలతో తన భూమిపై రుణం పొందిన వాళ్ల నుంచి తన భూమిని కాపాడాలి’ అని బాధితుడు పిటిషన్‌లో వివరించారు. ‘చట్టప్రకా రం తమకు చెందిన భూమిని 1963లో వోల్టాస్ లిమిటెడ్‌కు పారిశ్రామిక అవసరాల నిమిత్తం లీజుకు ఇచ్చాం.

లీజుకు ఇచ్చిన వారిలో నేను భాగస్వామిని. లీజు అగ్రిమెంట్‌ను ఉల్లంఘించి.. ఆ భూమిని వర్మ రియ ల్టర్స్‌కు కేటాయించింది. తనాఖా పెట్టకూడదని తెలిసినా బ్యాంకులో తాకట్టు పెట్టింది. లీజ్ డీడ్ రద్దు కోరుతూ 2013లో మేం రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించాం. మా భూమిని ఇతరుల పేరుపైకి మార్చకుండా, తనాఖా పెట్టకుండా ఆదేశాలివ్వాలన్న తమ అభ్యర్థనకు అనుగుణంగా తీర్పు వచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ వర్మ రియల్టర్స్ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలి తం లేకపోయింది. భూమి తమదేనని సుప్రీంకోర్టు తీర్పు ద్వారా తేలింది. 

అయితే, రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ప్రతివాదులతో చేతులు కలిపారు. ఈసీకి అప్లికేషన్ పెడితే మార్టిగేజ్ వివరాలు లేకుండా రిజిస్ట్రేషన్ అధికారులు ఇచ్చారు. సుజనా ఇండ స్ట్రీస్‌కు రుణం ఇచ్చే ముందు ఎక్సోర్టు ఇంపోర్టు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ఈ బ్యాంక్ రుణం మంజూరు చేసే నాటికే సుజనాచౌదరి రుణ ఎగవేతదారుగా ఉన్నారు. అయినా రుణం ఇచ్చేసింది.

వర్మ రియల్టర్స్, సుజనా హోల్డిం గ్స్ రెండు సంస్థల్లోనూ గొట్టుముక్కల శ్రీనివాసరాజు డైరెక్టర్. దీనిని బట్టి సుజనా హోల్డింగ్స్‌కు వర్మ రియల్టర్స్ బినామీ కంపెనీ అని స్పష్టమవుతుంది. 2015 వార్షిక నివేదికలను పరిశీలిస్తే వర్మ రియల్టర్స్ కూడా నష్టాల్లోనే ఉంది. సుజనా ఇండస్ట్రీస్ షేర్ విలువ కూడా రూ.10 నుంచి 30 పైసలకు పడిపోయింది. నా ఆస్తిని తనఖా పెట్టి సుజనా ఇండస్ట్రీస్ రుణం పొందేలా చేయడంలో వర్మ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అనుకూలంగా వోల్టాస్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ ఎల్ కర్కరే వ్యవహరించారు. 

వర్మ రియల్టర్స్‌కు గ్యారెంటీ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఈ మొత్తం లావాదేవీ మోసపూరితం. నేరపూరితం. వర్మ రియల్టర్స్ ఆస్తిని లీజుకు మాత్రమే తీసుకుంది. ఆ భూమి విలువ రూ. 24 కోట్లయితే రూ.91 కోట్లు రుణం తీసుకున్నారు. రూ.91 కోట్లు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణం ఎలా ఇచ్చిం దో అర్థం కావడం లేదు. బ్యాంక్ అధికారు లు సుజనా ఇండస్ట్రీస్‌కు, వర్మ రియల్టర్స్‌కు బ్యాంక్ అధికారులు పూర్తిగా సహకరించారు’ అని కూడా పిటిషన్లో పేర్కొన్నారు. 

ఇదులో ప్రతివాదులుగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్ సీపీ, బషీర్‌బాగ్ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌తోపాటు సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, వై సుజనాచౌదరి, ‘సుజన’ డైరెక్టర్లు గొట్టెముక్కల శ్రీనివాస్‌రాజు, నటరాజన్ సుబ్బుర త్నం, కిరణ్‌కుమార్ వీరమాచినేని, ఓల్టాస్ లిమిటెడ్ ఎండీ, డైరెక్టర్లు బహ్రం నవ్రోజ్ వాకిల్, జుబిన్ సోలి దుబాష్, వినాయక్ కాశీనాథ్ దేశ్పాండే, ప్రదీప్‌కుమార్, దేబేంద్రనాథ్ సారంగి, వర్మ రియల్టర్స్ అండ్ ట్రేడిం గ్ ప్రైవేట్ లిమిటెడ్, పీవీ వర్మ, డైరెక్టర్లు రమణారెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి దేవిరెడ్డి, చంద్రశేఖ ర్‌రెడ్డి కంచర్ల, శ్రీరామ్ కంభంపాటి, ఎక్సో ర్టు ్టఇంపోర్టు బ్యాంక్ ఆఫ్ ఇండియాను చేర్చారు. ఈ పిటిష్ప విచారణ జనవరి 20కి వాయిదా పడింది.