calender_icon.png 3 April, 2025 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆత్మహత్యలు వద్దు.. జీవితం ముద్దు

27-03-2025 01:06:33 AM

మరిపెడ సీఐ రాజ్ కుమార్

ఆత్మహత్యల నివారణ సామాజిక బాధ్యత:  కమిటీ చైర్మన్ అశోక్ 

 మహబూబాబాద్, మార్చి 26: (విజయ క్రాంతి)జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంతో ముందుకు సాగాలని ఆత్మహత్యలకు పాల్పడవద్దని మరిపెడ సీఐ రాజ్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం మరిపెడలో ఆత్మహత్యల నివారణ కమిటీ,సైకాలజిస్ట్ ల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆత్మహత్యల నివారణ సదస్సుల కరపత్రాలను సీఐ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఆపద సమయాల్లో తోటి వారితో కష్టాలను పంచుకుని పరిష్కార మార్గాలను అన్వేషించుకుని ముందుకు సాగాలన్నారు.తమనే నమ్ముకుని ఉన్న కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని అవరోధాలను చేధించుకుంటూ పోవాలన్నారు.ప్రాణం కంటే సృష్టిలో ఏది విలువైంది కాదని,డబ్బు కేవలం సౌకర్యాలను కల్పింస్తుందే కానీ ఎంత డబ్బు ఇచ్చినా ప్రాణాన్ని తిరిగి తీసుకురామన్నారు.

అంతటి విలువ కలిగిన ప్రాణాన్ని తీసుకోలన్నా ఆలోచన రానివ్వకుండా సమస్య సాధనకు ఆలోచిస్తూ ముందుకు సాగాలన్నారు.ఈ సందర్భంగా ఆత్మహత్యల నివారణ కమిటీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ సమాజానికి చేస్తున్న సేవను మెచ్చున్నారు.ఈ కార్యక్రమంలో మరిపెడ సబ్ ఇన్ స్పెక్టర్ సతీష్,సూరత్ తెలంగాణ ఉద్యమకారుడు మచ్చ వీరన్న,భారతి ఛారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ ఆడెపు రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.