ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు కారణంగా ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు...
శేరిలింగంపల్లి (విజయక్రాంతి): ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అరుణోదయ కాలనీ నిర్వాణ ఇన్ హోటల్ రూమ్ నెంబర్ 202 లో నిమ్మ వంశీ కృష్ణారెడ్డి(25) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని కొంతకాలంగా ఉద్యోగం అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే మంగళవారం ఉదయం 8:15 నిమిషాలకు క్యాబ్ బుక్ చేసుకొని ఇంటి నుండి బయటకు వెళ్ళిన నిమ్మ వంశీ కృష్ణారెడ్డి ఇంటికి తిరిగి రాలేదు. దాంతో కంగారుపడ్డ కుటుంబ సభ్యులు అతని స్నేహితులకు ఫోన్ చేసి అడగగా వాళ్లకు తెలియదని అన్నారు. కాగా బుధవారం నిర్వాణ ఇన్ హోటల్ రూంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు కారణంగా ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.