బెల్లంపల్లి (విజయక్రాంతి): నెన్నల్ మండలం దమ్మి రెడ్డి పేట (ఖర్జి) గ్రామానికి చెందిన పసుల పోషం (74) అనే వృద్ధుడు మద్యం మత్తులో పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నారని శుక్రవారం ఎస్సై ప్రసాద్ తెలిపారు. గురువారం ఉదయం భార్య బానక్క, తన ఇద్దరు కుమారులు కూలీ పనులకు వెళ్లిన సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడు పోశం భార్య బానక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు.