హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 11 (విజయక్రాంతి): అనారోగ్య సమస్యలతో వృద్ధ దంపతులు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం ఉప్పల్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. దుర్వాసుల సూర్యనారాయణ శాస్త్రి(60), ఆయన భార్య జగదీశ్వరి(56) స్థానిక సాయిరాంనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు సుశాంత్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
రిటైర్డ్ ఎన్టీపీసీ ఉద్యోగి అయిన సూర్యనారాయణ శాస్త్రి వారం రోజుల క్రితం ఢిల్లీకి వెళ్తున్నట్లు కుమారుడికి చెప్పినట్టు సమా చారం. అయితే దంపతులు సుమారు ఐదారు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఊరికి వెళ్లిన పనిమనిషి బుధవారం ఉదయం సూర్యనారాయణ ఇంటికి వెళ్లింది.
ఈ క్రమంలో వారి మృతదేహాలను గమనించి స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నా మని, తమ చావుకు ఎవరూ కారణం కాదని దంపతులు సూసైడ్ లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.