calender_icon.png 31 March, 2025 | 6:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువకుడి ఆత్మహత్య

29-03-2025 01:52:46 AM

మునుగోడు, మార్చి 28 : ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఉరేసుకొని యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురం గ్రామంలో జరిగిన ఈ ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలివి.. కిష్టాపురం గ్రామానికి చెందిన ఆరూరి శివ (25) వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవు తున్నాడు. దీంతో మనస్తాపానికి గురై ఈ నెల 26న గ్రామశివారులోని నిర్మానుష్య ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి సాయి లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవి తెలిపారు.