కామారెడ్డి, జనవరి 10 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని ఆర్గొండ గ్రామానికి చెందిన చౌదరి రాజశేఖర్(27) హైదారాబాద్‌లో ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామానికి వచ్చాడు. అంతకుముందు గల్ఫ్‌కు అప్పు చేసి వెళ్లాడు. అప్పు తీర్చే మార్గం లేక మనస్థాపానికి గురై శుక్రవారం రాత్రి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.