ఇబ్రహీంపట్నం, జనవరి 2: కడుపునొప్పి భరించలేక ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకు న్న సంఘటన మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచాల మండలం, చె న్నారెడ్డిగూడెం గ్రామానికి చెందిన కావలి ప్రవీణ్ (19) గురువారం మేకలను మేపడానికి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు.
అయితే మ ధ్యాహ్నం సమయంలో ప్రవీణ్ పొ లం వద్దగల పశువుల కొట్టానికి తా డుతో ఉరేసుకుని కనిపించడంతో పక్కపొలం రైతులు.. అతడి కుటుం బ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. ఏడాది క్రితం ప్రవీణ్‌కు అపెండిక్స్ ఆపరేషన్ జరిగిందని నొప్పి భరించలేక ఆత్మహ త్యకు పాల్పడి ఉంటాడని అతడి తం డ్రి బుగ్గరాములు తెలిపాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.