calender_icon.png 9 January, 2025 | 9:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుటుంబ కలహలతో నదిలో దూకి ఆత్మహత్య

03-01-2025 11:18:48 PM

కామారెడ్డి జిల్లా బొల్లక్‌పల్లిలో ఘటన...

కామారెడ్డి (విజయక్రాంతి): కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి మంజీరానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా పిట్లం మండలం బోల్లక్‌పల్లి వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బుడిమి గ్రామానికి చెందిన మ్యాతరి సాయిలు (57) శుక్రవారం ఇంట్లో కుటుంబ కలహాల వల్ల కలత చెందిన పిట్లం మండలం బొల్లక్‌పల్లి మంజీర నది వంతెన పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ కలహల తోనే సాయిలు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. మృతునికి భార్య, ఒక కూతురు ఉన్నారు. ఘటనపై పిట్లం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.