calender_icon.png 19 March, 2025 | 11:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య

19-03-2025 06:43:15 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ముసలమడుగు బ్రిడ్జ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న బూర్గంపాడు ఎస్ఐ రాజేష్ సంఘటన స్థలానికి చేరుకొని చెట్టుకు ఉరి వేసుకున్న వ్యక్తిని స్థానికుల సహాయంతో కిందికి దించి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుని ఆచూకీ తెలిస్తే సెల్: 8712682055 నెంబర్ కు తెలియజేయాలని ఎస్సై రాజేష్ తెలిపారు.