calender_icon.png 20 March, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతి స్థిమితం లేని వ్యక్తి ఆత్మహత్య..

19-03-2025 10:25:16 PM

మునిపల్లి: మతి స్థిమితం లేని వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం మునిపల్లి మండలంలో ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సదాశివపేట మండలంలోని ఆత్మకూర్ గ్రామానికి చెందిన నడుమిదొడ్డి పాపయ్య (48) మునిపల్లి మండలంలోని పోల్కంపల్లి గ్రామ శివారులో ఆత్మహత్య చేసుకున్నాడు.  ఈనెల 16 న మధ్య రాత్రి మృతుడు బయటికి వెళ్లి గ్రామ శివారులో ఒక చెట్టుకు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అల్లుడు ముత్యాల శివకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.