calender_icon.png 20 April, 2025 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎలుకల మందుతో ఆత్మహత్యాయత్నం..

20-04-2025 04:23:47 PM

కూతురుకి సైతం ఎలుకల మందు కలిపిన కూల్ డ్రింక్

చికిత్స పొందుతూ కూతురు మృతి..

బాచుపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి ఘోర ఘటన.. 

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): బాచుపల్లిలో ఓ తల్లి అమానుష ఘటనకు ఒడిగట్టింది. ఇంట్లో ఉన్న కలహాలతో మజా బాటిల్ లో ఎలుకల మందు కలిపి తాను తాగి, కూతురుకు సైతం తాగించింది. కూతురు మృతి చెందగా, తల్లి హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. ఈ సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాచుపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాచుపల్లి ఆదిత్య గార్డెన్ లోని హరిత ఆర్కేడ్ ప్లాట్ నెంబర్ 102 లో నంబూరి క్రిష్ణ పావని(32) తన భర్త సాంబశివరావు, కూతురు జెశ్విక(4)తో కలిసి నివాసం ఉంటుంది. క్రిష్ణ పావని గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంది.

తాను ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలకు తనకు ఏమైనా అయితే తన బిడ్డ అనాధ అవుతుందని భావించిన క్రిష్ణ పావని ఏప్రిల్ 18న సాయంత్రం మజా బాటిల్ కూల్ డ్రింక్ లో ఎలుకల మందు కలుపుకొని సేవించింది.తాను తాగడంతో పాటు తన కూతురు జెశ్విక (4) కు కూడా పాయిజన్ తో కూడిన కూల్ డ్రింక్ తాగించడంతో తీవ్రంగా అనారోగ్యం పాలు కావడంతో బయపడి జరిగిన విషయం తన భర్త సాంబశివరావుకు 19 వ తేదీ తెల్లవారుజామున తెలిపింది.

దీంతో సాంబశివరావు బాచుపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చి మెరుగైన చికిత్స కోసం కేపీహెచ్బీ కాలనీ రోడ్డు నంబర్ 1 లోని ప్రసాద్ హాస్పిటల్ కు తరలించాడు. తల్లి హాస్పిటల్ లోని ఐసీయూ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతుండగా పాప జెశ్విక పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం హుటా హుటినా కేపీహెచ్బీ లోని రెయిన్ బో హాస్పిటల్ కు తరలించారు. పాప జెశ్విక చికిత్స పొందుతూ మృతి చెందగా తల్లి ప్రసాద్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.