కుమ్రంభీం ఆసిఫాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): ప్రియురాలి కోసం యువకుడు సెల్ఫీవీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగిన ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కౌటాల మండలంలోని బోదంపల్లి గ్రామానికి చెందిన కార్నె వెంకటేశ్ ఓ యువతిని ప్రేమించాడు.
అమ్మాయి తరఫువారు వీరి పెళ్లిని నిరాకరించడంతోపాటు వీరిరువురి మధ్యా పెళ్లి విషయంలో గొడవ జరిగింది. దీంతో మనస్థాపనికి గురైన వెంకటేశ్ శనివారం సాయంత్రం తన ఇంట్లో పురుగుల మందు తాగుతూ సెల్ఫీవీడియో తీసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు వెంకటేశ్‌ణు మొదట కౌటాలకు తరలించి ప్రథమ చికిత్స అనంతరం కాగజ్‌నగర్ మండలం ఈస్‌గాంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారని తెలిసింది.