30-04-2025 12:00:00 AM
వెలుగుపల్లి లో వాటర్ ట్యాంకు ఎక్కిన కనకయ్య
తుంగతూర్తి , ఏప్రిల్ 27: పేద ప్రజల ప్రయోజనార్ధము ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభు త్వం పథకం ప్రవేశపెట్టగా ఒకపక్క అధికా రుల నిర్లక్ష్యం, మరొక ప్రక్క ఇందిరమ్మ కమిటీల నాయకుల అవినీతి తీరుతో, లిస్టులో పేరు నమోదు కాకపోవడంతో పాటు నాయకులు చేతిలో మోసపోయి ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం చే సిన సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగు పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన భయ్యా కనకయ్య గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాకపోవడంతో నీటి ట్యాంకు ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకునే యత్నం చేయగా పోలీసులు కాపాడారు. ఈ విషయంపై బాదితుడు మాట్లాడుతూ ఇందిరమ్మ కమిటీ సభ్యులకు తన ఇళ్లు కోసం మొదటి దఫలో రూ. 20 వేటు లంచం ఇచ్చానని లిస్టులో పేరు లేకపోవడంతో మోసపో యానని ఆవేదన వ్యక్తం చేశారు.