22-02-2025 09:38:52 AM
చేవెళ్ల: స్నేహితురాలు మాట్లాడడం లేదని పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. షాబాద్ సీఐ కాంతారెడ్డి వివరాల ప్రకారం.. షాబాద్ మండల కేంద్రంలోని పీఆర్ఆర్ఎం ఇంజినీరింగ్ కాలేజీలో అమనగల్ కు చెందిన బాలికల గురుకుల పాఠశాల నిర్వహిస్తున్నారు. ఇందులో నగరంలోని బాలాపూర్కు చెందిన శ్రీజ పదో తరగతి చదువుతోంది.
ఆమె స్నేహితురాలు మాట్లాడడం లేదని శుక్రవారం ఉదయం స్పిరిట్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తోటి విద్యార్థులు గమనించి ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వగా.. వాళ్లు వెంటనే షాద్ నగర్ ప్రభుత్వం ఆస్పత్రికి... అక్కడి నుంచి హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగ్గా ఉందని డాక్టర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న షాద్ నగర్ డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్వో విజయలక్ష్మి, ఎంఈవో లక్ష్మణ్ నాయక్, సీఐ కాంతారెడ్డి, ఎస్సై రమేశ్ పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల నుంచి వివరాలు సేకరించారు.