calender_icon.png 17 November, 2024 | 5:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నం

17-11-2024 03:41:23 AM

సమస్యపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు!

ఆవేదనతో పురుగుల మందు తాగిన బాధితుడు

కరీంనగర్, నవంబర్ 16 (విజయక్రాం తి): భూమి తగాదా విషయంలో న్యాయం జరగలేదని ఆవేదన చెందిన ఓ వ్యక్తి కరీంనగర్ జిల్లా చొప్పదండి పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చొప్పదండికి చెందిన కల్లేపల్లి ఆనంద్, వడ్లూరి లింగయ్యకు మధ్య భూ సమస్య ఉన్నది. ఈ క్రమంలోనే లింగయ్య గోడ నిర్మాణం చేపట్టడంతో ఆనంద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు చేసినా ఎస్సై అనూష, సిబ్బంది పట్టించుకోకపోవ డంతో పాటు న్యాయం చేయడం లేదని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఆనంద్ పురుగుల మందు తాగుతూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనిం చిన పోలీస్ సిబ్బంది అడ్డుకున్నారు. భూ సమస్యను పరిష్కరించి న్యాయం చేయాల్సి న ఎస్సై అనూష, పోలీస్ సిబ్బంది ఇబ్బందు లకు గురి చేయడంతోనే మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి నట్లు ఆనంద్ భార్య శారద తెలిపారు. ఎస్సై అనూషపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.