calender_icon.png 7 February, 2025 | 9:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య

07-02-2025 01:45:44 AM

జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 6: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు జాబితాలో తన పేరు రాలేదని గ్రామసభలోనే పురుగుల మందు తాగిన వ్యక్తి బుధవారం రాత్రి మృతిచెందాడు. ములుగు జిల్లా కన్నాయి  మండలం బుట్టాయిగూడెం గ్రామంలో గత నెల 23న గ్రామసభ నిర్వహించారు. అధికారులు అర్హుల జాబితాను చదివి వినిపించారు.

కొత్తూరుకు చెందిన కుమ్మరి నాగేశ్వరరావు అలియాస్ నాగయ్య అనే దళితుడి పేరు ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో లేదు. అధికారులను నిలదీస్తే పొంతన లేని సమాధానం చెప్పి తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అన్ని అర్హతలూ ఉన్నా తన పేరును జాబితాలో లేకుండా చేశారని మనస్తాపానికి గురై తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు.

గ్రామస్థులు మందు డబ్బాను లాక్కోగా, తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో వనిత పక్కకు వెళ్లిపోయారు. ఆ తర్వాత మరికొంతమంది అధికారులు, గ్రా  నాగయ్యను ఏటూరునాగారం ఆసుపత్రికి, అటునుంచి ము  ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి వరంగల్ పట్టణంలోని ఎం  ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు.

కాగా నాగేశ్వరరావు మృతి బాధాకరమని బీఆర్‌ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. చికిత్స పొందుతున్న నాగేశ్వర్‌రావును బుధవారం ఉదయం ఆయన పరామర్శించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యనేనని మండిపడ్డారు. ఆ కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.