calender_icon.png 31 October, 2024 | 3:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుహాస్ యతిరాజ్ @ 1

26-06-2024 01:08:54 AM

  • బీడబ్యూఎఫ్ పారా బ్యాడ్మింటన్

న్యూఢిల్లీ: భారత పారా షట్లర్ సుహాస్ యతిరాజ్  చరిత్ర సృష్టించాడు. మంగళవారం విడుదల చేసిన బీడబ్ల్యూఎఫ్ పారా బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానాన్ని అధిరోహించాడు. ఇన్నాళ్లు టాప్ స్థానంలో ఉన్న ఫ్రాన్స్ ప్లేయర్ లుకాస్ మాజుర్ రెండో స్థానానికి పడిపోయాడు. 40 ఏళ్ల సుహాస్ యతిరాజ్ ఖాతాలో 60, 527 పాయింట్లు ఉండగా.. లుకాస్ 58, 953 పాయింట్లు కలిగి ఉన్నాడు. టోక్యో పారాలింపిక్స్‌లో ఎస్‌ఎల్ విభాగంలో మాజుర్ చేతిలో ఫైనల్లో ఓడిన సుహాస్ రజతం గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఉత్తర్‌ప్రదేశ్ కేడర్‌లో ఐఏఎస్‌గా విధులు నిర్వర్తిస్తున్న సుహాస్  ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండోనేషియాకు చెందిన ఫ్రెడీ సెటియవాన్‌ను ఓడించి వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గాడు.