calender_icon.png 21 January, 2025 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెమీస్‌లో సుహాస్, నితేశ్

31-08-2024 12:00:00 AM

  1. ఆర్చరీ ప్రిక్వార్టర్స్‌లో సరిత, రాకేశ్ 
  2. రోయింగ్, సైక్లింగ్‌లో నిరాశ

పారిస్: పారాలింపిక్స్ రెండో రోజు పోటీల్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పారా బ్యాడ్మింటన్‌లో పురు షుల విభాగంలో భారత్‌కు చెందిన సుహా స్, నితేశ్‌లు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లారు. ఎస్‌ఎల్ 4 కేటగిరీలో సుహాస్ 26 21 తేడాతో  షిన్ (కొరియా)ను, ఎస్‌ఎల్ 3 కేటగిరీలో నితేశ్ 21 21 తేడాతో యాంగ్ (చైనా)ను ఓడించారు. మిగిలిన సింగిల్స్‌లో మానసి జోషీ, మనోజ్ సర్కార్‌లు ఓటమి పాలయ్యారు. పారా టేబుల్ టెన్నిస్ డబుల్స్ మ్యాచ్‌లో భారత జోడీ భవీనాబెన్ క్వార్టర్స్‌లో ఓటమి చవిచూశారు. ఆర్చరీలో మహిళల వ్యక్తిగత కాంపౌండ్‌లో సరితా దేవి, పురుషుల వ్యక్తిగత కాంపౌండ్‌లో రాకేశ్ కుమార్ ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. నేడు జరగనున్న ప్రిక్వార్టర్స్‌లో శీతల్ దేవితో పాటు వీరిద్దరు ప్రిక్వార్టర్స్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

పారా రోయింగ్‌లో భారత్‌కు చెందిన అథ్లెట్లు నిరాశపర్చారు. మిక్స్‌డ్ పీఆర్3 డబుల్స్ స్కల్స్ హీట్స్‌లో అనిత జోడీ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నారు. పారా సైక్లింగ్ ట్రాక్ ఈవెంట్‌లో భాగంగా తెలుగు అథ్లెట్ షేక్ అర్షద్ పురుషుల 3వేల మీటర్ల వ్యక్తిగత పర్స్యూట్‌లో రేసును 4 నిమిషాల 20.949 సెకన్లలో పూర్తి చేసి ఆఖరి స్థానం తో సరిపెట్టుకున్నాడు. మహిళల డిస్కస్ త్రో ఎఫ్ 55 ఫైనల్లో భారత అథ్లెట్లు నిరాశపరిచారు. పోటీల్లో పాల్గొన్న సాక్షి (21.49 మీటర్లు) విసిరి 8వ స్థానంలో నిలవగా.. కారమ్ జ్యోతి (20.22 మీటర్లు) విసిరి 9వ స్థానంతో సరిపెట్టుకుంది.