calender_icon.png 20 April, 2025 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలువకు.. ఇవీ దినుసులు

20-04-2025 12:00:00 AM

ఎండలు మండుతున్న నేపథ్యంలో ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో కొన్ని రకాల మార్పులు తప్పనిసరిగా చేసుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యల బారీన పడాల్సి వస్తుంది. ఆహారంలో మనం తీసుకునే మసాలా దినుసుల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. కడుపులో మంటను నివారించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు మాత్రమే కీలకపాత్ర పోషిస్తాయి. కాని అవన్నీ వేసవి కాలంలో తగినవి కావు. కొన్ని సుగంధ ద్రవ్యాలు గట్ పనితీరుకు అంతరాయం కలిగిస్తాయి. దీనికారణంగా జీర్ణసమస్యలు తలెత్తుతాయి. కాబట్టి సమ్మర్ సీజన్ లో ఏ మసాలా దినుసులు చేర్చాలో తెలుసుకుందాం.. 

జీలకర్ర

జీలకర్ర వేసవికాలంలో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడడమేకాకుండా శరీరాన్ని చల్లబరుస్తుంది. దీన్ని సాధారణంగా వివిధ భారతీయ వంటలలో ఉపయోగిస్తారు. ఆహారంలో జీలకర్రను చేర్చుకోవడం వల్ల జీర్ణవ్యవస్థలో అసౌకర్యాన్ని తగ్గించి, వేసవిలో మొత్తం గట్ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. 

సోంపు గింజలు

జీర్ణక్రియ కోసం ఈ గింజలను సాధారణంగా భోజనం తర్వాత తీసుకుంటారు. ఇవి శరీరానికి చలువ చేస్తాయి. జీర్ణ సంబంధిత సమస్యలు, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి వాటిని తగ్గించడంలో సహాయపడతాయి. భోజనం తర్వాత కొన్ని సోంపు గింజలను నమలడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడడమేకాకుండా వేసవికాలంలో అజీర్తి సమస్యలను నివారిస్తుంది. 

కొత్తిమీర

కొత్తిమీర భారతీయ వంటలలో విస్తతంగా ఉపయోగిస్తారు. ఇది శీతలీకరణ లకజణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. భోజనంలో ధనియాల పొడి లేదా తాజా కొత్తిమీర ఆకులను చేర్చడం వల్ల వేసవికాలంలో రుచితో పాటు గట్ హెల్త్ కూడా మెరుగుపడుతుంది. 

పుదీనా

ఉష్ణోగ్రతలు పెరిగే కాలంలో హెల్త్ ను పర్ఫెక్ట్ ఉంచడంలో ఒకటి పుదీనా ఒకటి. ఇది మంచి రుచిని కలిగి ఉంటుంది. కడుపుని శాంతపరచడానికి, ఆమ్లతను తగ్గించడానికి, అజీర్ణాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. సలాడ్లు, పానీయాలు లేదా పెరుగులో తాజా పుదీనా ఆకులను జోడించడం వల్ల వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.