calender_icon.png 17 October, 2024 | 11:30 PM

స్టార్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా సుధాకర్

17-10-2024 09:09:27 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): స్టార్ మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పుల్లూరి సుధాకర్ ను నియమిస్తూ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి పుల్లెల గోపిచంద్ గురు వారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియాచుక పత్రాన్ని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సీనియర్ ఉపాధ్యక్షుడు ఉపేంధర్ రావు చేతుల మీధుగా సుధాకర్ కు అందజేశారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్లు, క్యాంపులు నిర్వహించినట్లుగానే కార్యక్రమాలు చేపడుతూ బ్యాడ్మింటన్ క్రీడాకారుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.