calender_icon.png 28 October, 2024 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుద్దపూస ఇప్పుడేమంటడో!

28-10-2024 02:30:22 AM

  1. ఫాంహౌస్‌లో కేటీఆర్, ఆయన కుటుంబీకులున్నారు 
  2. డ్రగ్స్ సరఫరాదారు కూడా..
  3. పోలీసులు కావాలనే కేటీఆర్‌ను తప్పించారు
  4. కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): జన్వాడ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ కేసు విషయంలో సుద్దపూసను కావాలనే తప్పించారనే వార్తలు వస్తున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు కేసీఆర్ కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో బీఆర్‌ఎస్ నాయకులను కాపాడినట్లుగా డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న కేసీఆర్ కుటుంబ సభ్యులను కాపాడితే ప్రజలు తిరగబడతారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుం చుకోవాలని హెచ్చరించారు. ఈ పార్టీలో కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులున్నట్లు తమకు సమాచారం ఉందని తెలిపారు.

రేవ్ పార్టీ కేసుపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘మొబైల్ టవర్ లొకేషన్ గుర్తించాలి, సీసీ ఫుటేజ్‌ను బహిర్గతం చేయాలని, ముఖ్యమైన వ్యక్తుల పాస్‌పోర్ట్‌లను సీజ్ చేయాలి. లేదంటే వారు విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఒక్కటేనన్న విషయం వాస్తవమని పేర్కొన్నారు.

హోం మంత్రి కూడా అయిన సీఎం రేవంత్‌రెడ్డి ఈ కేసుపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరా రు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చుతామం టే, ఉక్కుపాదం మోపుతామంటే కేవలం కేటీఆర్ కుటుంబానికి డ్రగ్స్ తీసుకునేందుకు స్వేచ్ఛని ఇవ్వడమా? అని ప్రశ్నించారు. అనేక సందర్భాల్లో తాను సవాల్ చేసినా సుద్దపూసలా మాట్లాడిన కేటీఆర్.. ఇప్పుడేం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.

స్వయం గా కేటీఆర్ బావమరిది ఫాంహౌస్‌లోనే డ్రగ్స్ దొరికాయని తెలిపారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా పోలీసులు వ్యవహరిస్తే సరికాదని అన్నారు. రేవ్ పార్టీపై పక్కా సమాచారం వచ్చిందని, అన్ని వీడియోలు బయటకు వచ్చాయని తెలిపారు. జన్వాడ రేవ్ పార్టీలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర నిఘా వర్గాలకు సైతం తాము సమాచారం ఇస్తున్నామని బండి సంజయ్ తెలిపారు.