calender_icon.png 16 January, 2025 | 12:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్‌రెడ్డి

06-07-2024 12:07:20 AM

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి):  తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్‌రెడ్డిని నియమిస్తూ శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ వికాస్‌రాజ్‌ను రిలీవ్ చేసిన ఈసీ.. ఆయన స్థానంలో సుదర్శన్‌రెడ్డిని నియమించింది. సుదర్శన్‌రెడ్డి ప్రస్తుతం జేఏడీ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు వికాస్‌రాజ్ ఆధ్వర్యంలోనే జరిగాయి. అయితే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్త ఎన్నికల అధికారిని నియమించడం ఆసక్తికర పరిణామంగా మారింది.