calender_icon.png 16 November, 2024 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సుడా’ మాస్టర్ ప్లాన్ 2.0

16-11-2024 01:01:58 AM

  1. అథారిటీ పరిధిలోకి మరో 147 గ్రామాలు
  2. డిసెంబర్ 31 వరకు ప్రక్రియ పూర్తి
  3. ‘గ్రేటర్’ కరీంనగర్ దిశగా అడుగులు

కరీంనగర్, నవంబర్ 15 (విజయక్రాంతి): శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సుడా) పరిధిలోకి మరో 147 గ్రామాలను చేరుస్తూ రాష్ట్రప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సుడా 2017లో ఏర్పాటు కాగా, నాడు దాని పరిధిలోకి 72 గ్రామాలు వెళ్లాయి. వీటి పరిధిలోని ఎనిమిది గ్రామాలు 2019లో కరీంనగర్ నగరపాలక సంస్థలో వీలినమయ్యాయి.

ఇవి పోనూ కరీంనగర్ కార్పొరేషన్‌తోపాటు ప్రస్తుతం 64 గ్రామ పంచాయతీలు ఉండగా, మరో 147 గ్రామాలు సుడా పరిధిలోకి రానున్నాయి. కొత్తపల్లి, చొప్పదండి మున్సిపాలిటీలను కూడా సర్కార్ సుడాలోకి చేర్చింది. అలాగే త్వరలో జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీలు సైతం వెళ్లనున్నాయి.

కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని మరో 13 పంచాయతీలను విలీనం చేసే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సర్కార్ ప్రతిపాదనలు పంపారు.

నగరపాలక సంస్థ మరింత విస్తరించే అవకాశం ఉండడం, సుడా పరిధి పెరగడంతో కరీంనగర్ గ్రేటర్ కరీంనగర్‌గా ఎదిగే అవకాశం ఉంది. అదే జరిగితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మున్ముందు భారీగా అభివృద్ధి పనులకు నిధులు వస్తాయి. లే అవుట్ చార్జీలు, భవనాల అనుమతుల ద్వారా సుడాకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

సుడాలో చేరే పంచాయతీలు ఇవే..

చొప్పదండి మండల పరిధిలోని ఆర్నకొండ, భూపాలపట్నం, చిట్యాలపల్లి, గుమ్లాపూర్, కాట్నపల్లి, రాగంపేట, వెదురుగట్ట,  గంగాధర మండలంలోని బూరుగుపల్లి, చెర్లపల్లి, గంగాధర, గర్షకుర్తి, గట్టుబుత్కూర్, ఇస్లాంపూర్, కాచిరెడ్డిపల్లి, కొండయ్యపల్లి, కురిక్యాల, మల్లాపూర్, నాగిరెడ్డిపూర్, నర్సింహులపల్లి, న్యాలకొండపల్లి, ర్యాలపల్లి, సర్వారెడ్డిపల్లి, ఉప్పరమల్యాల, వెంకటయ్యపల్లి, రామడుగు మండలంలోని చిప్పకుర్తి, దత్తోజిపేట, గుండి, కొరటపల్లి, లక్ష్మీపూర్, మోతె, రామడుగు, రుద్రారం, షానగర్, శ్రీరాములపల్లి, తిర్మలాపూర్, తిమ్మాపూర్ మండలంలోని నల్లగొండ, పర్లపల్లి, మొగిలిపాలెం, పోలంపల్లి, మల్లాపూర్, నేదునూరు, వచ్చునూరు, చిగురుమామిడి మండలంలోని కొండాపూర్, ముదిమాణిక్యం, చిన్నముల్కనూరు, నవాబ్‌పేట, రామంచ, రేకొండ, సుందరగిరి, ఉల్లంపల్లి, ఇల్లందకుంట మండలంలోని టేకుర్తి, కనగర్తి, మల్యాల, రాచపల్లి, ఇల్లందకుంట, పత్రాయిపల్లి, వంతడ్పుల, హుజూరాబాద్ మండలంలోని చెల్పూర్, ధర్మరాజుపల్లి, హుజూరాబాద్, జూపాక, కందుగుల, కనుకులగిద్ద, కాట్రెపల్లి, పోతిరెడ్డిపేట, లింగాపూర్, సిర్సపల్లి, జమ్మికుంట మండలంలోని మడిపెల్లి, తనుగుల, జమ్మికుంట, కోరపల్లి, వావిలాల, బిజిగిరిషరీఫ్, సైదాబాద్, విలాసాగర్, మానకొండూర్ మండలం దేవంపల్లి, గంగిపెల్లి, గట్టుదుద్దెనపల్లి, కల్లెడ, కొండపల్కల, లలితాపూర్, మద్దికుంట, పచ్చునూరు, ఊటూరు, వన్నారం, వేగురుపల్లి, వెల్ది, సైదాపూర్ మండలంలోని ఆకునూరు, అమ్మనగుర్తి, బొమ్మకల్, దుద్దెనపల్లి, ఎక్లాస్‌పూర్, ఎలబోతారం, ఘన్‌పూర్, గొడిశాల, రాయికల్, రాంచంద్రాపూర్, సైదాపూర్, సోమారం, వెంకెపల్లి, వెన్నంపల్లి, శంకరపట్నం మండలంలోని అంబాలపూర్, ఆముదాలపల్లి, అర్కండ్ల, చింతగట్టు, చింతాయిపల్లి, ధర్మారం, ఇప్పలపల్లి, గద్దపాక, గొల్లపల్లి, కాచాపూర్, కల్వల, కన్నాపూర్, కరీంపేట, కేశవపట్నం, కొత్తగట్టు, లింగాపూర్, మక్త, మెట్‌పల్లి, మొలంగూర్, ముత్తారం, రాజాపూర్, తాడికల్, వంకాయగూడెం, ఎరడపల్లి, వీణవంక మండలంలోని భేతిగల్, దొంతుపల్లి, బ్రాహ్మణపల్లి, చల్లూరు, ఎలబాక, ఘన్ముకుల, కనపర్తి, కొండపాక, కోర్కల్, మామిడాలపల్లి, పోతిరెడ్డిపల్లి, రెడ్డిపల్లి, వల్బాపూర్, వీణవంక సుడాలో విలీనం కానున్నాయి. 

అమృత్-1 పథకం ద్వారా..

ప్రస్తుతం సుడా పరిధిలో ఉన్న 64 గ్రామాలు కరీంనగర్ కార్పొరేషన్‌కు సంబంధించిన మాస్టర్ ప్లాన్ రూపకల్పన పూర్తయింది. కేంద్ర ప్రభుత్వం అమృత్-1 పథకం ద్వారా ఆదిలాబాద్, రామగుండం, కరీంనగర్ సుడా పరిధిలో మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు రూ.170 కోట్లు కేటాయించింది. మాస్టర్ ప్లాన్ డిసెంబర్ 31 నుంచి అమలు కావాల్సి ఉంది.

దీనిపై ఇప్పటికే సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు వేర్వేరుగా సమీక్షలు నిర్వహించారు. డిసెంబర్ 31 తర్వాత అమలులోకి రాకుంటే కేంద్రం నిధులకు కోత విధించే అవకాశం ఉంది. సుడా త్వరలో ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించున్నది.

గ్రేటర్ దిశగా అడుగులు..

కరీంనగర్ రోజు రోజుకు తన పరిధులను విస్తరించుకుంటున్నది. మారుతున్న కాలానికి అనుగుణంగా నగరాన్ని కార్పొరేషన్ నుంచి గ్రేటర్ స్థాయికి పెంచేందుకు సర్కార్ అడుగులు వేస్తున్నది. 2041లో జనభా, నాటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని సరికొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. సుడా పరిధిలోకి కొత్తపల్లి మున్సిపాలిటీతో పాటు మరో 147 గ్రామాలు వచ్చాయి. దీనిపై త్వరలో సమావేశం నిర్వహించనున్నాం. సుడా చైర్మన్ 

కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి