కరీంనగర్, డిసెంబర్ 23(విజయక్రాంతి): కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో పలు అభివృద్ధి పనులకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రూపాయలు పది లక్షలతో మహిళా సమాఖ్య భవనానికి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. అనంతరం ఆరు లక్షల వ్యయంతో అయిదు కూడళ్ళలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభం చేశారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ప్రజల కోరిక మేరకు అవసరమైన దగ్గర అభివృద్ధికి నిధులు వెచ్చిస్తున్నామని రాబోయే రోజుల్లో మరి న్ని అభివృద్ధి పనులు చేపడుతామని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాంటివని త్వరలో రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతున్నామని నరేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మడుపు మోహన్,బానోతు శ్రవణ్ నాయక్,పిట్టల రవీందర్,డిఈ రాజేంద్ర ప్రసాద్, కంకణాల అనిల్ కుమార్, శంకరయ్య, లక్ష్మీనారాయణ, నిర్మల, అంజమ్మ, మాధవి తదితరులు పాల్గొన్నారు.