- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రప్రభుత్వం
- సుడా పరిధిలోకి ఐదు మున్సిపాలిటీలు
- 264 గ్రామ పంచాయతీలు
సూర్యాపేట, అక్టోబర్ 27 (విజయక్రాంతి): సూర్యాపేట సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్రప్రభుత్వం సూర్యాపేట అర్బన్ డెవలప్‌మెంట్ ఆథారిటీ (సుడా)ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వు లు జారీ చేసింది. ఇక నుంచి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, 264 పంచా యతీలను సు డా పరిధిలోకి వెళ్లనున్నాయి.
సుడా ఏర్పాటు తో మున్సిపాలి టీలు, పంచాయతీలు మరింత అబివృద్ధి సాధిస్తాయని జిల్లావాసులు అభిప్రాయపడుతు న్నారు. తమ ప్రాం తాల్లో మౌలిక వసతులు మెరుగుపడతాయని ఆకాంక్షిస్తున్నారు. కేం ద్ర, రాష్ట్రప్రభుత్వాల నుంచి ఇక నుం చి సుడాకు ప్రత్యేకంగా నిధులు వస్తాయని సంబురపడుతున్నారు.
సుడా పరిధి ఇలా..
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, తిరుమలగిరి, నేరెడుచర్ల పాటు 21 మండలాల్లోని 264 గ్రామ పంచాయతీలను కలుపుతూ సుడా ఏర్పాటు కానున్నది. దీంతో జిల్లాలో రహదారుల విస్తరణ, మెరుగైన నీటి సరఫరా, యువతకు ఉద్యోగ అవకాశాలు, శాటిలైట్ టౌన్‌షిప్‌లు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
పన్నుల భారం పెరిగే అవకాశం
సుడా ఏర్పాటుతో అభివృద్ధి సంగతి పక్కన పెడితే పంచాయతీ, మున్సిపాలిటీల్లో నివసించే వారిపై పన్నుల భారం పడుతుందని కొందరు పెదవి విరుస్తున్నారు. ఇకపై జీ ప్లస్ భవన నిర్మాణాలు, కొత్త లే ఔట్లకు సుడా నుంచే అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని, అనుమతుల జారీలో జాప్యం జరిగే అవకాశం ఉందని, అనుమతులకు సంబంధించిన చార్జీలు, బిల్డిం గ్ నిర్మాణ చార్జీలు పెరుగుతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. పంచాయతీల పరిధిలో సుడా గ్రీన్ జోన్, ఇండస్ట్రీయల్ జోన్, రెసిడెన్షియల్ జోన్లు ఏర్పాటు కానున్న నేపథ్య ంలో పన్నుల భారం పడుతుందంటున్నారు.
చైర్మన్ పదవిపై నేతల కన్ను..
సుడాకు ప్రస్తుతం కలెక్టర్ చెర్మన్‌గా వ్యవహరిస్తారని రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. కానీ, కొద్దిరోజుల తర్వాతైనా సుడాకు చైర్మన్‌ను నియమించాల్సి ఉంటుంది. నామినేటెడ్ పద్ధతిలో చెర్మన్ ఎంపిక చేయాల్సి ఉన్నది. దీంతో అధికార పార్టీ అయిన కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.
మరో కొన్నిచోట్ల..
కామారెడ్డి/మంథని, అక్టోబర్ 27 (విజయక్రాంతి): సూర్యాపేట ‘సుడా’తో రాష్ట్రంలోని మరికొన్నిచోట్ల రాష్ట్రప్రభుత్వం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల ను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. దీనిలో భాగంగానే కామారెడ్డి అర్బన్ డెవలప్‌మె ంట్ అథారిటీ (కుడా), రామగుండం అర్బ న్ డెవలప్‌మెంట్ అథారిటీ (రుడా) కూ డా ఏర్పాటైనట్లు పక్కాగా సమాచారం.
ఇదే కోవలో అదిలాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఔడా) కూడా ఏర్పాటై నట్లు తెలిసింది. కామారెడ్డి జిల్లా పరిధిలోని ‘కుడా’ ఏర్పాటుపై కలెక్టర్ ఆశిష్ సం గ్వాన్ మాట్లాడుతూ.. కామారెడ్డి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ఏర్పాటుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిం చాం.
కుడా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేసిందన్నారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాకేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాం తాలను కలుపుతూ ప్రభుత్వం ఆదిలాబా ద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఔడా) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని పరిధిలోకి ఆదిలాబాద్ ము న్సిపాలిటీతో పాటు ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లోని ఆరు మండలాలు వెళ్లనున్నాయి.