కొత్తపల్లి (విజయక్రాంతి): యస్ జిఎఫ్ రాష్ట్ర స్థాయి అండర్ 19 ఆర్చరీ క్రీడలను కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వద్ద గల తేజస్ అకాడెమీలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడల ద్వారా విద్యార్థులకు అనేక లాభాలు చేకూరుతాయని, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 68 వ ఆర్చరీ క్రీడలు కరీంనగర్ లో జరగడం సంతోషం అని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తేజస్ అకాడెమీ కరస్పాండెంట్ సతీష్ రావు క్రీడాకారులకు వసతి భోజన సౌకర్యాలు కల్పించడం అభినందనీయం అని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. క్రీడల నిర్వహణ కన్వీనర్ మధు జాన్సన్ కొత్తపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ రుద్రరాజు, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు నందేల్లి మహిపాల్, తేజస్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీష్ రావు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మయ్య, రాంబాబు,వేణు, కొరివి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.