మల్కాపూర్ లో స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న సుడా చైర్మన్
కరీంనగర్: సోమవారం నుండి ప్రారంభమైన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మాల్కాపూర్ గ్రామంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటారు. గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో నరేందర్ రెడ్డి మాట్లాడుతూ... పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఇంటి పరిసరాలలో చెట్లను పెంచడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. కూలర్లలో ఇతర పాత్రలలో నీరు నిల్వ ఉండడం వల్ల దోమలతో డెంగీ జ్వరాలు వస్తాయని ఉపయోగించని వాటిలల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని వ్యర్థాలను ఖాళీ ప్రదేశాలలో వేయకుండా గ్రామ పంచాయితీ చెత్త సేకరణ బండ్లలో వేయాలని నరేందర్ రెడ్డి అన్నారు. చీకటిగా ఉన్న గ్రామ కూడళ్లలో సుడా నుండి హైమాస్ లైట్లు ఏర్పాటు చేస్తామని అవసరమైన చోట సిసి రోడ్లు మురుగు కాల్వల నిర్మాణం చేపడుతామని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ ప్రభు,హెడ్మాస్టర్ సదేశ్ కుమార్,ఏపిఓ స్రవంతి,పంచాయితీ కార్యదర్శి శ్రీనివాస్ మాజీ ఎంపిటిసి ఈశ్వర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ బిసిసెల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్,గ్రామ శాఖ అధ్యక్షుడు కాశిపాక శంకర్,కీర్తి కుమార్ తదితరులు పాల్గొన్నారు.