27-03-2025 01:07:00 AM
కరీంనగర్, మార్చి 26 (విజయ క్రాంతి): ఢిల్లీలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ను సుడా చైర్మన్,సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కలిశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి జిల్లా కాంగ్రెస్ నగర కాంగ్రెస్ అధ్యక్షులతో ఢిల్లీలో భేటీ అయి పలు అంశాలపై ఏఐసిసి ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ చర్చించారు. ఇందులో భాగంగా ఢిల్లీలో నిజామాబాద్ డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి,నిజామాబాద్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు తో కలిసి మీనాక్షి నటరాజన్ తో సుడా చైర్మన్, కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి భేటీ అయ్యారు.