calender_icon.png 19 April, 2025 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సుడా చైర్మన్

19-04-2025 01:35:44 AM

కరీంనగర్, ఏప్రిల్ 18 (విజయ క్రాంతి):  సుడా నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శుక్రవారంబిసుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ముందుగా చింతకుంటలోని వినాయకనగర్ ఇందిరమ్మ కాలనీకి వెళ్లే రోడ్డుకు 15 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణం పనులకు శం కుస్థాపన చేశారు. అనంతరం 23 వ డివిజన్ లో మహిళా కమ్యూనిటీ భవనం మరియు మురికి కాలువ నిర్మాణం జిమ్ అన్నీ కలిపి 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే పనులకు శంకుస్థాపన చేశారు.

9 వ డివిజన్ లో 10 లక్షలతో పద్మశాలి సామాజిక భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక నాయకులు ప్రజల కోరిక మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధికి సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ముందుకు సాగుతున్నామని అ న్నారు.

ఈ కార్యక్రమాలలో మడుపు మోహ న్,శ్రవణ్ నాయక్,పిట్టల రవీందర్,మాజీ కార్పోరేటర్ ఆర్ష మల్లేశం,గంగుల దిలీప్,లిం గ మూర్తి,కంకణాల అనిల్ కుమార్,గంగుల దిలీప్, పోరండ్ల రమేష్,వంగల శ్రీనివాస్, మాసం రమేష్,రంగా నాయక్,స్వప్న,నిర్మల, సుజాత,ఆర్పిలు విజయ లక్ష్మి,సిగిరి లక్ష్మి,శో భారాణి తదితరులు పాల్గొన్నారు.